Wednesday, January 21, 2009

change


మార్పు కోసం
ముందుగ మనం మారాలి
మనమంతా మార్పు కోరాలి
రాజకీయాలకు అర్ధం మారాలి
ప్రజాసేవకు పరమార్ధం కావాలి .
సమాజం లో అన్యాయం కూల్చాలి
సామజిక న్యాయం చేకూర్చాలి.
నేటి పాలకులను మార్చాలి
పాలనా విధానమే మారాలి
డబ్బు తో ఓట్లు కొనేవారిని మార్చాలి
సాధ్యం కాని హామీగాళ్ళని మార్చాలి
అవినీతి ని అంతం చేయాలి
నీతి కి ప్రాణం పోయాలి .
కబ్జాదారుల భరతం పట్టాలి
పచ్చని పొలాలలో సేజ్జుల పొగలు అర్పాలి
యువత కు ఉపాది చూపాలి
మహిళ కు రక్షణ ఇవ్వాలి .
జలయజ్ఞం మాటున
ధనయజ్ఞం మానాలి .

అల్ ఫ్రీ లు మనకు వద్దు
అల్ కర్రుప్ట్లు అసలే వద్దు.

నింగిని అంటిన ధరలు
నేల కు వెంటనే తేవాలి .

అన్నదాతల ఆత్మహత్యలు ఆపాలి
నేతన్నల బ్రతుకులు బాగు చేయాలి

ఓటు ను తూటా గా పేల్చాలి
సమాజం లో పెను మార్పు ను తేవాలి.

ముందుగ మనం మారాలి
మనమంతా మార్పు కోరాలి.

No comments:

Post a Comment